అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. ఉట్నూర్ కొమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రగతిపై ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్ పి.ఎస్. బదావత్ సంతోష్, హేమంత్ బొర్కడే, ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్, ఇంచార్జి ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్త, అదనపు కలెక్టర్లు…
నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జంగు బాయి జాతర నేపథ్యంలో కెరమెరి మండలం గొండి గ్రామ పరిధిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు.
మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే వారి తరుఫున గొంతు విప్పుతామని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ కౌంటర్ వేశారు. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోష పెట్టిందన్నారు. కేటీఆర్ ఇప్పుడు సర్పంచ్‌ల గురించి మాట్లాడటం…
Minister Seethakka: 25,28 న మంత్రులు మేడారం జాతరకు రావాలని మంత్రి సీతక్క తెలిపారు. హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ 12 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడింది అని పేర్కొనింది.
ఆదిలాబాద్ జిల్లాపై సమీక్ష చేశారని అదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వెనకబడిన ప్రాంతమని, ఇంద్రవెల్లికి ఈ నెల 26 తర్వాత సీఎం వస్తా అన్నారన్నారు. నియోజకవర్గ సమస్యలపై చర్చ చేశామని, పార్టీ బలోపేతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఓడిపోయిన వారు అధైర్యపడొద్దు అని చెప్పారని, బీఆర్‌ఎస్ మమ్మల్ని బదనం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విధి విధానాలు కూడా రూపొందించక ముందే బీఆర్‌ఎస్ నేతలు మాటలు మట్లాడుతున్నారని, కూల్చుతం అని కడుపు మంట…
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర అని అన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేడారం భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 75 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అధికారుల అందరు సమన్వయంతో జాతర పూర్తి చేయాలని ఆమె వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తుల ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. జనవరి నెల లాస్ట్ వరకు జాతర పనులు పూర్తి చేస్తామని, రాష్ట్రస్థాయిలో సీఎం…
రోహిత్ శర్మ కెప్టెన్సీలో చారిత్రాత్మక విజయం.. సిరీస్ సమం ఇప్పటి వరకు ఏ ఆసియా జట్టు చేయలేని పనిని భారత జట్టు చేసింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కడంతో పాటు రోహిత్ శర్మ తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో…
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్ర్తీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి తెలియజేసారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తూ శాఖను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలో, వారి జీవన ప్రమాణాలు పెంపొందించడంలో గ్రామీణ రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. ఈ రోడ్ల నిర్మాణంలో…
అధికారం పోయిందనే అక్కసు.. బీఆర్ఎస్లో కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గడిలా పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించడానికే 35 రోజులు తీసుకుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రజలు ధైర్యంగా ఉన్నారని, ధైర్యం కోల్పోయింది బీఆర్‌ఎస్ నేతలేనని ఆమె విమర్శించారు. ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబరు 7న అని, 9వ తేదీనే రెండు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి సీతక్క. ఒకే సారి రుణమాఫీ అన్నారు..…