Medaram Jatara : మేడారంలో తాత్కాలిక బస్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడారంలో భక్తుల కోసం తాత్కాలిక బస్ స్టేషన్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. 55 ఎకరాల్లో బెస్ క్యాంప్‌తో కూడిన బస్ స్టాండ్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఓకే సారి 30 వేల మంది క్యూ లైన్లో ఉండేలా బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. మేడారం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి సుధాకర్ ప్రారంభానికి రాలేక పోయారని ఆమె వెల్లడించారు. గతంతో పోలిస్తే 20 ఎకరాలను ఎక్కువగా బస్ స్టాండ్ ను విస్తరించామని ఆమె పేర్కొన్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, రెండు సంవత్సరాల కొకసారి సమ్మక్క, సారక్క వన దేవతలు బయటకు వస్తారన్నారు. డబ్బులతో సంబంధం లేకుండా ప్రజలు వచ్చే పండుగ మేడారం జాతర అని ఆమె అన్నారు. వందల కిలోమీటర్లు బంగారాన్ని నెత్తిన పెట్టుకొని వస్తారని, మేడారం కు వచ్చే దారిలో పార్కింగ్, తాత్కాలిక బస్ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతర విజయవంతం లో టీ ఎస్ ఆర్టీసీ కృషి ఎంతో ఉంటుందని, భక్తులు స్వియనియంత్రణ తో దర్శనం చేసుకోవాలనీ కోరుతున్నామన్నారు.
Neti Bharatham: ఒకే పాత్రతో ‘నేటి భారతం’ సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే ప్రసిద్ధ గిరిజన జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది . ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24 వరకు రైళ్లు నడపనున్నట్లు కేంద్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి ద్వైవార్షిక కార్యక్రమం కోసం భక్తులు మేడారం వెళ్లేందుకు ఈ ప్రత్యేక రైళ్లు దోహదపడతాయి. ప్రత్యేక రైళ్లు 07017/07018 సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ – సిర్పూర్ కాగజ్‌నగర్, 07014/07015: వరంగల్ – సికింద్రాబాద్ – వరంగల్ , 07019/0720 నిజామాబాద్ – వరంగల్ – నిజామాబాద్ ఈ రైళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలు, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భోంగీర్, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాలకు కనెక్టివిటీని నిర్ధారిస్తాయి. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు, సంరక్షించేందుకు, గిరిజన వర్గాల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అన్నారు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లతో పాటు జాతర నిర్వహణకు కేంద్రం రూ.3 కోట్లు మంజూరు చేయనుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?