Minister Seethakka : కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు త్యాగాల పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు త్యాగాల పార్టీ అని అన్నారు మంత్రి సీతక్క. ప్రజల కోసమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని ఆమె అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు వ్యక్తుల పార్టీలు స్వార్థపూరిత పార్టీలు అని ఆయన అన్నారు. ఓట్ల చీలిక కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు ఓ నాయకుడు కండువా కప్పుకొని గత ప్రభుత్వ కాలం స్వర్ణ యుగం అంటున్నాడని, మరి అప్పుడు ఎందుకు పార్టీ కి అధ్యక్షుడిగా ఉన్నావు అంటూ ఆర్ ఎస్ ప్రవీణ్ ను మంత్రి సీతక్క ప్రశ్నించారు. అక్షింతలు ఇచ్చి అధికారం లోకి రావాలని చూస్తున్నారని, దేశం కోసం, దేశమే కుటుంబం గా భావించి జనం కోసం పనిచేసే కుటుంబ సోనియా గాంధీ కుటుంబమన్నారు. రాహుల్ ను ప్రధాని చేయటం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీ లోకి వచ్చే వారిని వద్దనవద్దన్నారు. జనం లో మంచి పేరు ఉంటే జనం తో ఉన్న వారిని పార్టీలోకి తీసుకురండన్నారు.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
ఇదిలా ఉంటే.. ఖానాపూర్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఇవాళ ఆమె పర్యటించారు. అనంతరం పెంబి మండల పరిధిలోని కొట్టుకుపోయిన పసుపుల వంతెనను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె ఖానాపూర్‌లో హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అలేఖ్యను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?