Minister Seediri Appalaraju: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర ఎన్ని అపశృతులతో మొదలైందో చూశాం అన్నారు.. మన ఆలోచన సక్రమంగా లేకపోతే మన ప్రయత్నం వృథా అవుతందని నమ్మకం.. లోకేష్ పాదయాత్ర చూస్తే అది నిజమనిపిస్తోందని విమర్శించారు. లోకేష్ పాదయాత్రకు ఓ లక్ష్యం లేదు…
Seediri Appalaraju:మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పవన్ ఓ వెర్రిబాగులోడు అంటూ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు.. నారాలోకేష్ యువగళం.. పవన్ యువశక్తి అని పేర్లు పెట్టారంటే.. కథ, స్క్రీన్ ప్లే అంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే సిద్ధం అవుతుంది.. పవన్ కల్యాణ్ కేవలం రేటు తీసుకున్న యాక్టర్ మాత్రమే నంటూ సంచలన ఆరోపణలు చేశారు.. పవన్ కల్యాణ్, చద్రబాబు కలవడం వెనుక…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు రావు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తాం.. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి? అని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సహా పలువురు వైసీపీ కీలక నేతలు చెబుతూ వస్తున్నారు.. ఇదే సమయంలో.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అనే తరహాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ప్రజల్లో ఉండేందుకే కార్యక్రమాలు తీసుకుంటున్నారు.. వరుసగా సమావేశాలు, సభలు పెడుతున్నారు.. ఈ తరుణంలో.. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.. శ్రీకాకుళం జిల్లా తన…
అమరావతి రైతుల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వారికి వ్యతిరేకంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసింది జేఏసీ.. అయితే, పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.. పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని ప్రకటించారు.. మా కడుపు కొడతామంటే ఊరుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన.. పాదయాత్ర ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15న నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరుగుతోంది.. టీడీపీ పాదయాత్ర పేరుతో మా…
ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు.. పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.. పార్టీ పంపిన లేఖపై చర్యలుంటాయనడం అప్పలరాజుకి తగదని.. మంత్రి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదలైంది.. ఇక, ఈ లేఖ సోషల్ మీడియాలో ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. అయితే, గతంలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరిట లేఖ విడుదల…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోంది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుండగా… దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పుమంటున్నాయి.. నందమూరి ఫ్యామిలీ కూడా ఈ మార్పును తప్పుబడుతోంది.. అయితే, యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచితమైన నిర్ణయం అన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు… ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, ఎన్టీఆర్‌ను మానసికంగా క్షోభ పెట్టారు… అందుకే ప్రాయశ్చిత్తంగా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు అని విమర్శించారు…
అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు… అమరావతి ప్రాంత భూముల స్కాం ఆరోపణల్లో కొత్త వాదన తెర మీదకు తీసుకుని వచ్చిన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుని తీరుతాం అన్నారు.. ఈ విషయంలో చర్చే అవసరం లేదన్న ఆయన.. శ్రీకాకుళం పోరాటాల గడ్డ.. మా ప్రాంతానికి వచ్చి మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా? అంటూ ఫైర్ అయ్యారు… ఇక, డిసెంబర్‌లో రాజధాని…
కోవిడ్ తో రాష్ట్ర ఆర్దిక పరిస్దితి దెబ్బతింది అని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కోవిడ్ కారణంగా ముప్పై వేల కొట్లు ప్రభుత్వం పై అధనపు భారం పడింది అని తెలిపారు. ప్రభుత్వానికి కష్టాలు ఉన్నా పేదలకు సంక్షేమం అందించాం. అని చెప్పిన ఆయన పిఆర్సి ఇస్తామన్న మాట డిలే అయ్యింది. కానీ సీఎం జగన్ కృతనిచ్చయంతో ఉన్నారు. ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ ఇచ్చాం. ఒకరిద్దరు మాటలు భూతద్దంలో చుడాల్సిన పనిలేదు. ఉద్యోగులు…