Maoist Letter: ఏపీ మంత్రికి మరోసారి మావోయిస్టుల వార్నింగ్.. నాకు సంబంధం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు.. పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.. పార్టీ పంపిన లేఖపై చర్యలుంటాయనడం అప్పలరాజుకి తగదని.. మంత్రి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదలైంది.. ఇక, ఈ లేఖ సోషల్ మీడియాలో ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. అయితే, గతంలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరిట లేఖ విడుదల కాగా.. ఇప్పుడు వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరిట లేఖ వచ్చింది. పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి మావోయిస్టులు.. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలంటూ ఆయనను వార్నింగ్ ఇచ్చారు.. మావోయిస్టులపై తప్పుడు ప్రచారం మంచిది కాదని లేఖలో హితవుపలికారు..
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
అయితే, మావోయిస్టుల లేఖపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు.. మావోయిస్టుల నుంచి నాకు లేఖ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు.. మావోయిస్టుల లేఖలోని అంశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఈ లేఖ నిజమా? లేదా? అనే విషయాన్ని తేల్చాల్సింది పోలీసులే అన్నారు. లేఖలో ప్రస్తావించిన అంశాల విషయానికి వస్తే.. రామకృష్ణాపురం భూములకు సంబంధించి.. సూదికొండలోని గ్రావెల్ క్వారి గురించి అసలు నాకేంటి? సంబంధం అని ప్రశ్నించారు. సూదికొండ అనేది పాలస నడిబొడ్డున ఉండే కొండ.. గతంలోనే గ్రావెల్ క్వారీకి అనుమతి తీసుకొచ్చి.. పార్టీకి చెందిన నేతే క్వారీ ప్రారంభించారు.. కానీ, అది మంచిది కాదని, ప్రజల నుంచి వ్యతిరేక వస్తుందని.. నేనే క్వారింగ్ ఆపించి.. కౌన్సిల్‌లో తీర్మానం చేయించామన్నారు.. అయితే, సూది కొండ క్వారింగ్ ఆపినందుకు తమ పార్టీలోని నేతే.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఒక అసమ్మతి నేత నాపై దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి…
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు