Seediri Appalaraju:మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పవన్ ఓ వెర్రిబాగులోడు అంటూ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు.. నారాలోకేష్ యువగళం.. పవన్ యువశక్తి అని పేర్లు పెట్టారంటే.. కథ, స్క్రీన్ ప్లే అంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే సిద్ధం అవుతుంది.. పవన్ కల్యాణ్ కేవలం రేటు తీసుకున్న యాక్టర్ మాత్రమే నంటూ సంచలన ఆరోపణలు చేశారు.. పవన్ కల్యాణ్, చద్రబాబు కలవడం వెనుక ప్యాకేజీ మాటలే ఉంటాయి.. తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టవని ఆరోపించారు. ఇక, నాదేండ్ల మనోహార్ ఓ పనికిమాలినవ్యక్తి అని విమర్శించారు.. ఉద్దానం ప్రజలకు ఏం కావాలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి స్పష్టతవుంది.. కిడ్నీ రోగులకు అన్ని విధాల జగన్ ప్రభుత్వం ఆదుకుందన్న ఆయన.. జగన్ సంకల్పం గురించి మాట్లాడేంత స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు.. మత్స్యకారుల భరోసా గురించి మాట్లాడుతున్న పవన్., నాదేండ్ల మనోహార్ కు అసలు అవగాహనేలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ పరిహారం అందలేని.. మత్స్యకారులు, కిడ్నీరోగులకు అన్నివిధాల తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.
ఇక, మందస మండలం లోహరిబందలో గ్రామస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులతో మంత్రి విడుదల రజినీతో కలిసి సమావేశమైన మంత్రి అప్పలరాజు.. అనంతరం హరిపురం డయాలిసిస్ సెంటర్, పలాస లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్ని రీసెర్చ్ సెంటర్ నిర్మాణ పనులు పరిశీలించారు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మన ప్రాంతం పట్ల అనేక వరాలు కురిపించారు.. కిడ్నీ వ్యాధిగ్రస్తుడు జీవితం క్లోజ్ అయిపోయిందనుకున్న పరిస్థితి నుండి ఈ ప్రభుత్వం మనల్ని చూసుకుంటుందని స్థాయికి వచ్చారని.. అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎంటో తెలుసుకోడానికి మంత్రిగారు, వైద్యాధికారులు ఇక్కడకి వచ్చారని తెలిపారు.. ఇప్పుడు డయాలసిస్ కి వెయిటింగ్ అనే పరిస్థితి లేదు.. కంటి తుడుపు చర్యగా గత ప్రభుత్వంలో 5, 6 కోట్లతో తాగునీటికి ఏర్పాట్లు చేపట్టారని.. కానీ, ఎక్కడా పనులు జరిగిందే లేదన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.