విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్‌లో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీలో త్వరలో కనుమరుగయ్యే పార్టీ జనసేన పార్టీ అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయ కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ యువకులకు సంబంధించిందని.. ఎవరికీ ట్రైనింగ్ ఇవ్వకుండా , ఇన్‌స్టిట్యూట్ కట్టకుండా డబ్బులు కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. అవినీతి జరిగిందా లేదా అనేది చూ�
అసలు పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని సెటైర్లు వేశారు.