కోవిడ్ తో రాష్ట్ర ఆర్దిక పరిస్దితి దెబ్బతింది అని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కోవిడ్ కారణంగా ముప్పై వేల కొట్లు ప్రభుత్వం పై అధనపు భారం పడింది అని తెలిపారు. ప్రభుత్వానికి కష్టాలు ఉన్నా పేదలకు సంక్షేమం అందించాం. అని చెప్పిన ఆయన పిఆర్సి ఇస్తామన్న మాట డిలే అయ్యింది. కానీ సీఎం జగన్ కృతనిచ్చయంతో ఉన్నారు. ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ ఇచ్చాం. ఒకరిద్దరు మాటలు భూతద్దంలో చుడాల్సిన పనిలేదు. ఉద్యోగులు అర్ధం చేసుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. అలాగే కొద్ది రొజుల్లో ఉద్యోగుల సమష్యలు అన్ని పరిష్కారం అవుతాయి అని పేర్కొన్నారు.