ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు రావు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తాం.. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి? అని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సహా పలువురు వైసీపీ కీలక నేతలు చెబుతూ వస్తున్నారు.. ఇదే సమయంలో.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అనే తరహాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ప్రజల్లో ఉండేందుకే కార్యక్రమాలు తీసుకుంటున్నారు.. వరుసగా సమావేశాలు, సభలు పెడుతున్నారు.. ఈ తరుణంలో.. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.. శ్రీకాకుళం జిల్లా తన సొంత నియోజకవర్గ కేంద్రం పలాసలో నూతనంగా నిర్మించిన తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. కార్యకర్తలు, నాయకులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు..
Read Also: New Post For CS Sameer Sharma: సీఎస్ సమీర్ శర్మ కోసం కొత్త పోస్టు క్రియేట్ చేసిన జగన్ సర్కార్..
ఇక, సమైక్యతతో ముందుకు వెళ్లాలి.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలోనే మనం ఉన్నాం అన్నారు మంత్రి అప్పలరాజు.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బతికి ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు.. ఇష్టానుసారంగా కొందరు లేనిపోనివి మనం మీద రాస్తున్నారు.. బొచ్చుడు రాసుకున్నా పరవాలేదు.. మీ అండ ఉన్నంత వరకూ నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. జన్మభూమి కమిటీల పేరిట ప్రజలకు ఎంతో ఇబ్బందులు పెట్టారు.. నచ్చిన వాడికి ఒకలాగ, నచ్చని వాడికి ఒకలాగ చూస్తూ.. చంద్రబాబు నాయుడుకి పాడి కట్టాయి జన్మభూమి కమిటీలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉప ఎన్నికలు రాబోతున్నాయా? అనే చర్చ మొదలైంది.. ఏ నియోజకవర్గం సమావేశం జరిగినా.. మరో 16 నెలల్లో ఎన్నికలకు రాబోతున్నాయి.. మన టార్గెట్ 175 స్థానాలు.. అంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్న విషయం విదితమే.