వైద్య సిబ్బంది పనివేళలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై మండిపడ్డారు.. ఈ విషయంపై గురువారం సాయంత్రం మూడు గంటలకు పైగా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో లోతుగా సమీక్షించారు. పనివేళల పట్ల నెలకొన్న క్రమశిక్షణా రాహిత్యం, దానిని అరికట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో చేపడుతున్న చర్యలు, పరిస్థితిని మెరుగుపర్చేందుకు మున్ముందు చేపట్టాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు.
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (Food Safety and Standards Authority of India)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగళవారంనాడు ఢిల్లీలో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జి.కమలవర్ధనరావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సి.హరికిరణ్, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. వైఎస్ జగన్ మొదటి నుండి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తువచ్చారని ఆరోపించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలచివేసిందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇలాంటి నేరం ఎవరూ.. ఎప్పుడూ భగవంతుడు విషయంలో పాల్పడి ఉండరని వ్యాఖ్యానించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారు.. టీటీడీని రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నారు అంటూ మండిపడ్డారు..
రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.. ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. 8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉండగా 2120 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని ఆరోపించారు . దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని అన్నారు.
అధిక వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రజల ఆరోగ్యం పట్ల వివిధ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇదే సమయంలో.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం అన్నారు.. యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను.. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను అన్నారు..
Sathya Kumar: ఆరోగ్య శ్రీ అమలుపై ఏపీ వైద్య మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ ఎక్కడికి పోదు... యధావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు గత 5 ఏళ్లలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు.. ఎన్డీయే అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో.. అప్పుడే దుష్ప్రచారం చేస్తున్నారు.