Minister Nara Lokesh and BJP MLAs: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.. ఇక, అసెంబ్లీలోని మంత్రి నారా లోకేష్ చాంబర్‌ను ఆయనతో సమావేశం అయ్యారు మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు.. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.. చాలామంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ.. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందట.. అయితే, పార్టీలో చేరికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని బీజేపీ నేతలు తెలిపారట.. అలాంటిది ఏదైనా ఉంటే ఉమ్మడిగా నిర్ణయిద్దామని.. లోకేష్ దృష్టికి తీసుకెళ్లారట బీజేపీ నేతలు.. పార్టీలో చేరికలపై కూటమి పక్షాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిదని బీజేపీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని లోకేష్ ముందు పెట్టారట..
Read Also: TG Govt: 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. 9 శాఖలపై చర్చ
ఇక, ఈ ప్రతిపాదన మంచిదని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.. తోట త్రిమూర్తులు చేరికపై వస్తున్న ఊహగానాలను ప్రస్తావించారట అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి. బీజేపీలో చేర్చుకుంటున్నారా? అని మంత్రి సత్యకుమార్ ను ప్రశ్నించారు నల్లమిల్లి… అయితే, తనకు తెలిసి అటువంటిదేదీ లేదని సత్య కుమార్ బదులిచ్చారట.. మొత్తంగా మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ (బీజేపీ), బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో.. పార్టీలో చేరికలపై కీలక చర్చ జరిగిందని.. బీజేపీ నేతలు చెబుతున్నారు.