Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మరలా భారతీయ వైద్య విధానం వైపు చూస్తుందన్నారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఆయూష్ డాక్టర్ల ఆత్మీయ సన్మానంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆయుష్ డాక్టర్ల స్టైఫండ్ ను పెంచిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.. ప్రపంచమంతా మరలా భారతీయ వైద్య విధానం వైపు వస్తోందని.. ఆయుష్ కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రధాని…
వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆరోగ్య శాఖ పై చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
డాక్టర్ సమరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో జరిగిన డాక్టర్ సమరం రాసిన 218వ పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో అందరూ 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు.. కానీ, 86 సంవత్సరాల వయసులో కూడా డాక్టర్ సమరం రిటైర్ కాలేదన్నారు.. వాజ్ పేయ్ కూడా రిటైర్ కాలేదు, అలసిపోలేదు అని ఒక సమావేశంలో చెప్పారని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఆరోగ్య శాఖ…
22 మంది డాక్టర్లు, నర్సులపై చర్యలు చేపట్టేందుకు విచారణకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2020లో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన నిర్వాహకాలపై చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి, 2020లో ఏసీబి ఆకస్మిక తనిఖీలో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జూన్ లో ఏసీబీ అధికారులిచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న మంత్రి చర్యలకు ఆదేశించారు. అవినీతి, పాలన వైఫల్యాలు, పర్యవేక్షణ లోపాల్ని గుర్తించారు. ఇన్‌పేషెంట్లపై తప్పుడు లెక్కలు.. మందుల వినియోగాన్ని సరిగా చూపని నర్సులు.. గత ప్రభుత్వ హయాంలో…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అబ్బద్ధాలను ప్రచారం చేయడంలో ఆరి తేరిందన్నారు.. వాళ్ల భాష, పరామర్శలు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన.. వేలాది మందితో వెళ్లి చేసేది పరామర్శా? లేక దండ యాత్రో.. వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఎక్కువ మంది పోలీసులను పెడితే.. 2 వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేవారు.. పహల్గామ్‌లో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్చగా పేర్కొన్నారు సత్యకుమార్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయం అయినా.. మా మద్దతు ఉంటుంది అని ఆగ్రదేశాలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు..
Minister Satya Kumar: ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆర్ధిక రంగంలో దేశంలోనే మొట్ట దటి పీహెచ్‌డీ సాధించిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. అలాంటి ఆయనను న్యాయశాఖకు మాత్రమే పరిమితం చేసి ఆర్థిక, రక్షణ రంగాలకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దూరం చేశారని ఆరోపించారు.
Minister Satya Kumar: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు.