అనకాపల్లిలోని పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలోని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి బండారు ఇంటి దగ్గర పోలీసు యాక్షన్ మొదలైంది. బండారు ఇంట్లోకి పోలీసులు చొచ్చుకుపోయారు. ఆయనను తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
చంద్రబాబుకి శిక్షపడాలని అందరూ కోరుకున్నారు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి శిక్షపడడంతో మ్రొక్కులు చెల్లించుకున్నాను అని ఆమె పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకి పూర్తిస్థాయిలో భధ్రతా ఏర్పాట్లు కల్పించామని మంత్రి రోజా అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు తన అధికారాన్ని దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. అధికారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపిందని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుది మాటల ప్రభుత్వమన్న మంత్రి రోజా.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు.