Minister RK Roja: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిపై కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి ఆర్కే రోజా.. అమ్మ మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకి వెళ్తే మీరేమో ఆ అవినీతి పరుడుకి మద్దతుగా ప్రజలను మోత మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారు. మీ భర్త నారా లోకేష్‌కి మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..? మీ మామ ఏమో అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ పోరాటాన్ని కాపీ కొట్టి పల్లాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటున్నారు.. బావుంది. మీ ఫామిలీ ఫ్యామిలీ అంతా కాపీ కొట్టడమేనా..? నీ మామ మీద ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు. కానీ, నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్లు చేశారు.
ఇక, బకాసురుడిలా ప్రజల సొమ్మును దోచేసిన నీ మామ చంద్రబాబు మీద చర్యలకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తావా బ్రహ్మణి అంటూ నిలదీశారు మంత్రి రోజా.. అంటే మీరు కోర్టులకంటే గొప్పోల్లా..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..? కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతుందన్న జ్ఞానం లేదా..? #TDPGoons అనే హాష్ ట్యాగ్ జత చేశారు మంత్రి ఆర్కే రోజా..
కాగా, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనకు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు నారా బ్రహ్మణి..”పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి. చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి” అంటూ సోషల్ మీడియా వేదికగా బ్రహ్మణి పిలుపునిచ్చిన విషయం విదితమే.
అమ్మ మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకి వెళితే మీరేమో ఆ అవినీతిపరుడుకి మద్దతుగా ప్రజలను మోత మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారు. మీ భర్త @naralokesh కి మంగళగిరిలో ఎలా మోత… https://t.co/ys65DrpQeO
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 29, 2023