తూర్పు గోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీలో మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదని.. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ననే ఒన్స్ మోర్ అవుతారని మంత్రి పేర్కొన్నారు.
ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వంద కోట్ల బడ్జెట్ క్రీడలకు కేటాయించారన్నారు. 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు.
RK Roja Filed Defamation Case: టీడీపీ నేత బండారు సత్యనారాయణపై వైఎస్సార్ సీపీ మంత్రి ఆర్కే రోజా కేసు ఫైల్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండారుతో పాటు మరో ఇద్దరిపై మంగళవారం నగరి కోర్టులో ఆమె పరువు నష్టం దావా వేశారు. ఇటీవల మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను కించపరిచే విధంగా వ్యవహరించిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, నగరి నియోజకవర్గ…
టీడీపీ- జనసేన పార్టీల పొత్తులపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్, లోకేష్ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు.. పాడుతా తీయగా కార్యక్రమంలాగా ఇటు ఆరుగురు ఆడు ఆరుగురు కూర్చుని సెలక్షన్ చేశారు.. ఆర సున్న.. ఆర సున్న కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించారు అనడం కామెడిగా ఉంది అని ఆమె సెటైర్లు వేశారు.