RK Roja: పక్కా ఆధారాలున్నాయ్.. చాలా స్కిల్డ్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు తన అధికారాన్ని దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. అధికారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపిందని తెలిపారు. స్కిల్ స్కామ్ జరగలేదని, తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలిగారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు లాయర్లు కుంటిసాకులపైనే వాదించారని అన్నారు. చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. బోగస్ కంపెనీలతో దోచుకున్న కరప్షన్ కింగ్ అని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై కక్షసాధించే అవసరం తమకు లేదని తెలిపారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టింది ప్రజల కోసమని పేర్కొన్నారు.
Also Read: Perni Nani: చంద్రబాబు ఎన్నో స్కామ్ లు చేశారు..
Also Read
పక్కా ఆధారాలతో దొరికితే కొందరు గగ్గోలు పెడుతున్నారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ అధికారులు చంద్రబాబుకు లేఖ రాసిన మాట నిజం కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. స్కిల్ స్కామ్‌లో ఈడీ విచారణ జరిపింది నిజం కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఇన్నాళ్లూ తప్పించుకున్నారన్నారు. దత్తపుత్రుడు చంద్రబాబు అవినీతిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నలు గుప్పించారు టీడీపీ నేతలు, పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తప్పు చేసి ఇంకా బకాయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి రోజా చెప్పారు.. సాక్ష్యాధారాలతో దొరికిపోయి బంద్‌కు పిలుపునిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తొస్తాయన్నారు. చంద్రబాబు పేరు చెబితే అన్ని స్కాంలే గుర్తొస్తాయన్నారు. చాలా స్కిల్డ్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ చేశారన్నారు. అమరావతిలో భూముల్ని దోచుకున్నారని ఆమె విమర్శించారు. పోలవరం, పట్టిసీమ వరకు అవినీతి చేశారని, ప్రజల నెత్తిన టోపీ పెట్టి నిధులు దోచేశారన్నారు. కక్షసాధింపులకు పాల్పడిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు సానుభూతి రాజకీయాలు ప్రజలు నమ్మరని ఆమె వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రసేనగా మార్చేశారని, అవినీతికి పాల్పడిన వ్యక్తికి ఆయన మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ బంద్‌కు సపోర్టు చేయకున్నా పవన్ ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు పవన్ పవర్ స్టార్ కాదు.. ప్యాకేజ్ స్టార్ అంటూ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిపై గతంలో పవన్ మాట్లాడటం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ప్యాకేజీ కోసమే పవన్ చంద్రబాబుకు మద్దతిచ్చారని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!