Minister RK Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. కృష్ణా జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్ కల్యాణ్ పనికిమాలినోడు అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, పవన్‌ను లాగి కొట్టాలనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి పవన్ గౌరవం ఇవ్వాలని సూచించారు. పవన్ ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని.. కానీ, పవన్ ను ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇక, సీఎం వైఎస్ జగన్‌కు…
సీఎం వైఎస్ జగన్ అంటే వణుకు అనుకున్నా.. జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. కానీ, వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ పవన్ పై సెటైర్లు వేశారు.
Minister rk roja congratulates chiranjeevi and ram charan: ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళరవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో మెగా అభిమానులు, మెగా కుటుంబ సభ్యుల ఆనందం రెట్టింపు అయింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రమంలో రామ్ చరణ్…
చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయన్నారు.. పిచ్చికి పరాకాష్ట టీడీపీ ఛార్జ్‌షీట్ అని ఫైర్ అయ్యారు.. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు.. సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇక, ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన…