మూడు సార్లు సీఎంగా చేస్తే, మ్యానిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాను అనో.. ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. కాగా.. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు.. తనమీద ఎందుకు చేయరని పేర్కొన్నారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవీ ఇస్తే అమ్ముడుపోయి.. తనపైనే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు.
కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలు దర్శనాలలో భాగంగా క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. క్షీరా రామలింగేశ్వర స్వామి పార్వతి అమ్మవార్ల ఆశీస్సులు జగనన్నకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు.