భీమవరంలో జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు పవన్ రాకపోవడాన్ని తప్పుపట్టారు మంత్రి ఆర్కే రోజు.. ఈ కార్యక్రమానికి రావాలని పిలిచినా టైం లేక రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అంటున్నారు.. మన్యం వీరుడికి పవన్ ఇచ్చిన విలువ ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు
ఏపీ సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగరాస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్లేరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్నని విమర్శించే ఆ బ్లడీ ఫూల్స్ అందరికీ బాక్సులు బద్దలయ్యేలా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయండి అంటూ పిలుపునిచ్చారు.. ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రులు పాలించారు.. కానీ, వారందరి చరిత్రను తిరగరాస్తున్న చరిత్రకారుడు వైఎస్ జగన్…
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఓ వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన పొత్తుల నుంచి సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పేరు ప్రకటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికలకు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ పోటీ చేయడం లేదు. కానీ.. బీజేపీ పోటీకి సిద్ధమైంది. అయితే నెల్లూరు జిల్లాలో తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఘన విజయం…
క్విట్ చంద్రబాబు… సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా… కడప వేదికగా అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్న ఆమె.. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని…
నగరి ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఆర్ కె రోజా బిజీబిజీగా మారిపోయారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడప్పుడూ ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. మంత్రి రోజా సెల్వమణికి వింత అనుభవం ఎదురైంది. అది కూడా తన స్వంత నియోజకవర్గంలో ఆ అనుభవం ఎదురుకావడంతో ఆమె అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో గడపగడపకు YCP కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజా చిత్తూరు – నగరిలో పర్యటించారు. ఈక్రమంలో ఆమె ఓ వృద్ధుడితో…
రైతుల గురించి అనునిత్యం ఆలోచిస్తున్నారని అన్నారు మంత్రి రోజా. రాష్ట్రంలో ఎక్కడా పడితే అక్కడ సిగ్గు లేకుండా చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నారు. 14 ఏళ్ళు అధికారంలో 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల గురించి ఏ రోజైనా ఆలోచించారా? రైతు భరోసా లాంటి గొప్ప పథకం గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు రోజా. చంద్రబాబు అధికారంలో ఉండగా 92 శాతం రైతులను అప్పుల ఊబిలో ముంచారు. వ్యవసాయం దండగ అని పుస్తకం రాసింది చంద్రబాబు…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త సెల్వమణి ఓ వివాదంలో చిక్కుకున్నారు.. తమిళ సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా తమిళ సినీ పరిశ్రమ తరఫున ఆయన మాట్లాడడం వివాదానికి కారణమైంది.. ఇతర రాష్ట్రాల్లో షూటింగులు జరగడంతో తమిళనాడు ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తమిళ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయాయి… అయితే, సెల్వమణిపై మండిపడుతోంది తెలుగుదేశం పార్టీ.. సెల్వమణి వ్యాఖ్యలపై మంత్రి రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. Read…
తెలంగాణ మంత్రి కేటీఆర్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అప్పటి నుంచి కేటీఆర్‌పై కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నారా లోకేష్.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలకు మీడియాతో పాటు నారా లోకేష్ కూడా వక్రీకరించారని మండిపడ్డారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఆయన పక్క రాష్ట్రాలు అన్నారు.. గానీ, ఆంధ్రప్రదేశ్ అని అనలేదని.. ఒక వేళ ఆంధ్ర…
మొదట సినిమాల్లో నటించిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు.. ఇక, వైసీపీ చేరిన తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాదు.. మంత్రి పదవి కూడా చేపట్టారు.. అయితే, తనను సినిమాల్లోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి తీకొచ్చింది ఎవరు అనే విషయంపై పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించిన విషయం తెలసింది.. ఇవాళ తిరుపతిలోని బ్లిస్ హోటల్ లో మంత్రి రోజాను ఘనంగా సన్మానించింది ఏపీ హోటల్ అసోసియేషన్.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నన్ను సినిమాల్లోకి,…
సీఎం వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను.. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు మంత్రి ఆర్కే రోజా… సచివాలయంలోని రెండో బ్లాకులోని టూరిజం మంత్రి శాఖ చాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.. బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి వచ్చారు.. బాధ్యతలు స్వీకరించేముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు రోజా భర్త సెల్వమణి.. మంత్రి చాంబర్‌లో చైర్‌లో కూర్చొన్న తర్వాత తల్లికి ముద్దు పెట్టారు రోజా కూతురు… ఇక, ఈ…