ఆ ఏపీ మంత్రులు ఇద్దరూ.... తమ జిల్లాను పూర్తిగా గాలికొదిలేశారా? ప్రతిక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి భయపడుతున్నారా? వాళ్ళు రెచ్చిపోతున్నా... వీళ్ళు కామ్‌గా ఉండటం వెనక వేరే లెక్కలున్నాయా? ఎవరా ఇద్దరు మినిస్టర్స్? ఎందుకు వాళ్ళలో స్పందనలు కరవయ్యాయి?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీకి చెందిన ఐదుగురు మంత్రుల పర్యటన కొనసాగుతోంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్, సవిత, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. పేదలకు మంత్రి శుభవార్త పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. 2 లక్షల 30 వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పారు.
వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు.
రేపు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డ్, టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.
భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు