Building Permissions: భవన నిర్మాణాలకు దరఖాస్తు చేసుకునేవారికి గుడ్‌న్యూస్.. సింగిల్ విండో ద్వారా అనుమతులు..!
- భవన నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు..!
- భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో సమీక్ష..
- దరఖాస్తు చేసుకునే వారికి వెంటనే అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు..
- సంబంధిత అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Building Permissions: భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి.. ఈ సమావేశానికి పురపాలక శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ హరినారాయణన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజీ శేషగిరి బాబుతో పాటు పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, గనులు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ ఆయా శాఖల వారీగా అనుమతులు జారీ చేస్తున్న విధానం… అనుమతుల మంజూరుకు తీసుకుంటున్న గడువు వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ.. అన్ని శాఖలను ఆన్ లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్జానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.. ఇక, భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆయా శాఖలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఒక్కోశాఖ నుంచి అనుమతి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. ఈ జాప్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Read Also: Jammu Kashmir Assembly Polls: నేడు జమ్మూకశ్మీర్కు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
అయితే, భవన నిర్మాణాల కోసం అగ్నిమాపక శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.. దీనికోసం ప్రస్తుతం పరిశ్రమలకు ఇస్తున్న ఆన్ లైన్ అనుమతుల అప్లికేషన్ ను DPMS వెబ్ సైట్ కు అనుసంధానం చేస్తే సరిపోతుందని సూచించారు.. ఇక గనుల శాఖ కూడా పెద్దపెద్ద భవనాల విషయంలో అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది.. భవన నిర్మాణాల కోసం భారీ గుంతల తవ్వకాల కోసం గనుల శాఖ అనుమతి తప్పనిసరి.. దీనికి సంబంధించి సీనరేజి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. పరిశ్రమలకు అనుమతుల విషయంలో ప్రస్తుతం ఇదే రకమైన విధానాన్ని పాటిస్తున్నారు.. ఈ విధానాన్నే భవన నిర్మాణాల అనుమతులకు అనుసంధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి నారాయణ.. మరోవైపు, భవనం నిర్మాణం సమయంలోనే ఎంతమేర ఇసుక అవసరం అవుతుందనేది కూడా తమకు ఇవ్వాలని గనుల శాఖ అధికారులు కోరారు.. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజినీర్ గోపాల కృష్ణా రెడ్డికి సూచించారు. ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చే అనుమతులు సులభతరం చేయాలని నిర్ణయించారు.. దీంట్లో భాగంగా ఇప్పటికే పరిశ్రమల శాఖకు ఇస్తున్న విధానాన్ని ఏకీకృతం చేయాలని నిర్ణయించారు. ఆయా శాఖల సమన్వయంతో సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేసేలా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి నారాయణ.
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!