డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్-1, ఫేజ్-2లను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని ఆరోపించారు.
Nimmala Ramanaidu: గత విధ్వంస పాలనకు నిదర్శనం ఇరిగేషన్ ప్రాజెక్టులే అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 17 నెలల పాటు పోలవరం ఆలన పాలన లేకుండా చేశారు.. పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచీ నాలుగు వేల క్యూసెక్కులు అయినా ఉత్తరాంధ్రకు ఇవ్వాలని సీఎం అన్నారు..
Minister Nimmala Rama Naidu: ఆరేళ్ల అనంతరం నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారని ఆయన వెల్లడించారు. ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టు అంటూ వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక పాలనతో రైతులు విసుగెత్తిపోయారన్నారు. Read Also: Minister…
ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. డయాఫ్రం వాల్ ఉందో లేదో తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫేజ్ - 1, ఫేజ్ - 2 అని ఏ రోజూ మేం చెప్పలేదన్నారు.
రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనమండలిలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో సిద్దేశ్వరం - అలుగు ప్రాజెక్ట్‌పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు.
Minister Rama Naidu: 2014-19లో గత టీడీపీ పాలనలో రూ.3038 కోట్లు ఖర్చుపెట్టి 40 పనులు పూర్తి చేశామని.. 2019-24 వైసీపీ పాలనలో కేవలం రూ. 760 కోట్లు ఖర్చుపెట్టి 5 శాతం పనులు మాత్రమే చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ వేదికగా తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై తమ అనుచరులతో ఎన్జీటీలో వైసీపీ కేసులు వేయించిందని చెప్పారు. 2021 డిసెంబర్‌లో వైసీపీ అధికారంలో ఉండగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు ఎన్జీటీ…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అని.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపాలన్నారు. నిద్రపోయే వాణ్ణి లేపవచ్చని.. నిద్ర నటించే వాణ్ణి ఎవరు లేపగలరని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఇసుకపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయంగా మార్చుకుందని విమర్శించారు. వారం పది రోజుల్లో ఓపెన్ రీచ్‌లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఏ రోజు ఏం పని చేయాలనే దానిమీద ఒక రూట్ మ్యాప్ తీసుకోమని అధికారులను ఆదేశించామన్నారు.
భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అలెర్ట్ అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లోస్ మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. సోమశిల రిజర్వాయరుకు గతంలో ఎన్నడు రానంత వరద ఈ సారి వస్తోందన్నారు.