Minister Nimmala Rama Naidu: అన్నదాతల అండదండలన్నీ కూటమి ప్రభుత్వానికే.. మరోసారి రుజువైంది..
- సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం
- కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారు..
- అన్నదాతల అండదండలన్నీ కూటమి ప్రభుత్వానికే ఉందని రుజువైంది
- మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Rama Naidu: ఆరేళ్ల అనంతరం నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారని ఆయన వెల్లడించారు. ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టు అంటూ వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక పాలనతో రైతులు విసుగెత్తిపోయారన్నారు.
Read Also: Minister Nadendla Manohar: సంక్రాంతి తర్వాత రోడ్ల నిర్మాణాలు ప్రారంభం
Also Read
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
జగన్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి గానీ, బలపరచడానికి గానీ ఒక్క రైతూ ముందుకు రాకపోవడంతో తోకముడిచారని ఎద్దేవా చేశారు. సాగునీటి సంఘాల ద్వారా రైతులకు, రైతుబిడ్డలే సేవ చేసుకునేలా దాదాపు 60 వేల మందికి సాగు నీటిరంగంలో ప్రాతినిధ్యం కల్పించామన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థ మరింత బలపడటానికి ఈ అన్నదాతలు ఎంతో దోహదపడతారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుందన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో 93శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిస్తే, ఇప్పుడు సాగు నీటిసంఘాల ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్‌తో ఏకగ్రీవంగా విజయం అప్పగించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడం, కూటమి అభ్యర్థులకు ఇంత భారీ విజయాన్ని అందించడం.. అంటే ఇది అన్నదాతల విషయంలో ఆల్ టైం రికార్డ్ అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అన్నదాతల అండదండలన్నీ కూటమి ప్రభుత్వానికే ఉందని మరో సారి రుజువైందన్నారు.
తాజావార్తలు
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..