Minister Nimmala: అబద్ధాలకు, అసత్యాలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సీసాలో బిరడా బిగించి మూతపెట్టిన వైసీపీ భూతాన్ని ఎవరు ముందు తెరుస్తారో వాళ్ళనే తినేస్తుంది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంభీరం మాటల్లో తప్ప చేతల్లో వుండదు.. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారని మేం అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉంటే ప్రైవేటీకరణ, ప్రతిపక్షంలో ఉంటే ముసలి కన్నీరే వైసీపీ విధానం అని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాదు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా నాడు వాజపేయి హయాంలో రూ. 1333 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ సాధించి కాపాడింది చంద్రబాబే.. వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర చేసేలా ప్రయత్నాలు జరిగితే వైసీపీ ఎంపీలు, నాయకులు నోరు మెదపలేదు అని మంత్రి నిమ్మల విమర్శించారు.
Read Also: Mana Shankara Vara Prasad Garu : షాకింగ్ నాన్ థియేట్రికల్ రైట్స్
ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు రూ. 11 వేల కోట్ల నిధులు తీసుకొచ్చి, ప్రైవేటీకర కాకుండా అడ్డుకున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో డీఎస్సీ, మెగా డీఎస్సీ అని ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు.. ఐదేళ్ళలో ఒక్క టీచర్ భర్తీ లేకుండానే విద్యకు గుండు సున్నా చుట్టాడు జగన్.. నాడు అడ్డగోలు సిఫార్సులు, బదిలీల పేరుతో రూ. 50 కోట్లు వసూళ్లు చేశారు.. ఎన్నికల విధులనుండి టీచర్లను తప్పించే ప్రయత్నం చేశారు.. రంగులు, టైల్స్, ఎలక్ట్రికల్, గార్డెనింగ్ వంటి కమీషన్లు వచ్చే పై పై పనులు చేసి నాడు, నేడు లో వేలకోట్లు దోచుకున్నారు.. పూజించాల్సిన గురువులను, వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టారు. మరుగు దొడ్లను కడిగించారని నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: Mirai : మిరాయ్ పోస్ట్ పోన్.. ఇన్ సైడ్ స్టోరీ
అయితే, డీఎస్సీ అంటేనే చంద్రబాబు.. చంద్రబాబు అంటేనే డీఎస్సీ.. దేశంలో రికార్డు స్థాయిలో 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుదే అని మంత్రి రామానాయుడు వెల్లడించారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ విడుదల చేసి 16, 347 పోస్టులు భర్తీ చేస్తున్నాం.. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా పిల్లలకు నాణ్యమైన షూస్, బ్యాగులు, యూనిఫామ్ వంటి కిట్లు అందించడంతో పాటు మధ్యాహ్నం సన్నరకం బియ్యంతో భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.