Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. రానున్న మార్చి నాటికి మునిసిపాలిటీల పదవీకాలం పూర్తి కానున్నాయని అన్నారు. అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాజమండ్రిలో మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటించారు. మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. కొర్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. పుష్కర పనులపై డిసెంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారని ప్రకటించారు.. అనంతరం గోదావరి పుష్కర పనులను ప్రారంభిస్తారని అన్నారు. 590 కోట్ల రూపాయలతో గోదావరి పుష్కరాల పనులు చేపడతామని వెల్లడించారు. 456 కోట్లుతో రోడ్లు, డ్రైనేజీల నిమిత్తం ఖర్చు అవుతుందని ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకుని వచ్చారని తెలిపారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. ఇక, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై వచ్చే ఆదాయంలోని 50 శాతం స్థానిక సంస్థలకు కేటాయిస్తామన్నారు. మరోవైపు, గత ప్రభుత్వం చెత్తపై 80 కోట్లు పన్నులు వసూలు వేసి 80 శాతం చెత్తను వదిలేశారని విమర్శించారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ..
Read Also: They Call Him OG: పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రీమియర్స్ పడుతున్నాయ్!