Minister Narayana: టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ ఆసక్తికర సమాధానాలు..
- టిడ్కో ఇళ్ల పరిస్థితిపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలు..
- వచ్చే జూన్ నెలాఖరులోపు 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తాం..
- పూర్తయిన ఇళ్లు ప్రతి శనివారం లబ్దిదారులకు అప్పగించాలని ఆదేశాలు..
- వైసీపీ ప్రభుత్వం 4,39,841 ఇళ్లను రద్దు చేసేసిందన్న నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. వచ్చే జూన్ నెలాఖరులోపు 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం అని ప్రకటించిన ఆయన.. ఎక్కడైనా పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు అప్పగించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలిచ్చాం అన్నారు.. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌళిక వసతులకు, కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలకు కలిపి రూ.7,280 కోట్లు అవసరం.. ఈ నిధులను హడ్కో ద్వారా, వివిధ బ్యాంకుల నుంచి లోన్ లు సేకరిస్తున్నాం అన్నారు.
Read Also: 200MP టెలిఫోటో కెమెరా, 7,000mAh బ్యాటరీలతో వచ్చేస్తున్న Realme GT 8 Series!
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
2014-19 లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించింది.. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం అన్నారు మంత్రి నారాయణ.. అయితే, గత ప్రభుత్వం వీటిని 2,61,640 కు తగ్గించడమే కాకుండా… ఇళ్లను కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు.. అంటే మొత్తంగా 4,39,841 ఇళ్లను రద్దు చేసేసింది అని మండిపడ్డారు.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవకతవకలకు పాల్పడింది.. 39,520 మంది లబ్దిదారులకు అర్హత లేదని పక్కన పెట్టేసిందని మండిపడ్డారు.. ఇళ్లకు పార్టీ రంగులు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదని విమర్శించారు.. ఇళ్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేరుమీద బ్యాంకు లోన్ లు తీసుకుంది.. ఈ లోన్ లు చెల్లించేందుకు ఈ ప్రభుత్వం 140 కోట్ల రూపాయాలు బ్యాంకులకు చెల్లించిందని వివరించారు మంత్రి పొంగూరు నారాయణ..
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!