Minister Narayana: అమరావతి చాలా సురక్షితంగా ఉంది.. భవిష్యత్‌లో కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సురక్షితంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు మంత్రి నారాయణ.. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన ఆయన.. అనవసర ప్రచారం నమ్మవద్దు అన్నారు.. బుడమేరు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు.. కొండవీటి వాగు వల్ల కూడా ఇబ్బంది లేదన్నారు.. అమరావతి చాలా సురక్షితంగా ఉందన్నారు.. ఇక, కొండవీటి వాగు, పాల వాగులపై త్వరలో టెండర్లు పిలిచి పనులు చేస్తాం అన్నారు..
Read Also: MP Mithun Reddy: ఎంపీ మిథున్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. నేనే ఎమ్మెల్యేగా పోటీచేస్తా..!
ఇక, బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు.. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని మండిపడ్డారు మంత్రి నారాయణ.. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదు.. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నాం.. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ని డిజైన్ చేస్తున్నాం అన్నారు. వచ్చే రెండు నెలలో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షా కాలం లోపు పూర్తి చేస్తాం అన్నారు.. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్స్ ని సైతం డిజైన్ చేయటం జరుగుతుందని వెల్లడించారు. ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్ కి పంపించటం జరుగుతుంది.. ఇలాంటివి చేయటం వల్ల అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదు.. కరకట్టని 4లైన్లతో గతంలో డిజైన్ చేశామని.. ఐకాన్ బిల్డింగ్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారని వెల్లడించారు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనేది 80 శాతం పూర్తి చేయటం జరిగిందన్నారు మంత్రి నారాయణ.. రైతులకి కౌలు చెల్లింపు అనేది ఒకటి క్లియర్ చేయటం జరిగింది.. ల్యాండ్ పూలింగ్ పై డౌట్స్ ఉన్నాయని రైతులు అడిగారు.. వాటి పై క్లారిటీ వస్తే భూములు ఇవ్వటానికి ముందుకి వస్తామని రైతులు మాట్లాడారని పేర్కొన్నారు మంత్రి నారాయణ. కాగా, ఓవైపు కృష్ణానదిలో భారీ వరద.. బుడమేరు కాలువకు గండ్లు.. ఇంకోవైపు భారీ వర్షంతో విజయవాడ అతలాకుతలం అయిన విషయం విదితమే.. దీంతో.. అమరావతి రాజధానిపై కూడా కొంత ప్రచారం జరిగిన నేపథ్యంలో.. దానిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.