Minister Narayana: విజయవాడలో వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రిక ప్రాంతాల్లో ఇళ్ల క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది.. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.. ఇళ్లను క్లీనింగ్ చేయడం కోసం ప్రభుత్వం ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసింది అని చెప్పారు. నిన్న కొందరు మళ్ళి వరద అంటూ విష ప్రచారం చేశారు.. వైసీపీ కుట్రగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. విష ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేశాం.. ఎవరు విష ప్రచారంకి పాల్పడ్డారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం వరద బాధితులకు మొదటి రోజు నుంచి అండగా నిలబడింది అని మంత్రి నారాయణ అన్నారు.
Read Also: Mathuvadalara2 : బ్రేక్ ఈవెన్ దిశగా మత్తు వదలరా2.. 2డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
కాగా, విపత్తుల నుంచి ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టెక్కించారు అని మంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబు పాలన దక్షతను చూసి ఓర్వలేని వైసిపి కుట్రలకు, విషప్రచారానికి దిగింది.. ఇది సిగ్గుమాలిన, నీతిమాలిన చర్య అని చెప్పారు. వైసీపీ కుట్రగా భావిస్తున్నాం.. డీజీపీకి ఫిర్యాదు చేశాం.. చంద్రబాబు పాలన దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం.. విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నారాయణ చెప్పుకొచ్చారు.