Minister Narayana: విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్యాక్ చేయించింది. సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులకు పంపిణీ కోసం ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు సిద్ధం చేశామన్నారు. ఒక్కో ప్యాకెట్ లో 6 ఆపిల్స్, 6 బిస్కట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉన్నాయని తెలిపారు.
Read Also: Nandamuri Mokshagna : జూనియర్ నటసింహం నందమూరి మోక్షజ్ఞ.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..
ఇక, వరద బాధితులకు అందరికీ అందేలా ఏర్పాట్లు చేశాం అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నిత్యావసరాల సరుకులు కూడా పంపిణీ ప్రారంభిస్తున్నాము.. బుడమేరు వాగు మూడో గండి పూడ్చేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్మీ రంగంలోకి దిగింది.. మరో 24 గంటల్లో గండి పూడ్చివేత పూర్తి కావొచ్చు.. ఆ తర్వాత మరో 24 గంటల్లో పారిశుధ్యం పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.