శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు.
నెల్లూరు నగరానికి తాగునీటిని అందించే పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఈ తాగునీటి పథకం పనులను చేపడతామన్నారు.
Nandigam Suresh: మాజీ ఎంపీకి అస్వస్థత.. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు
దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభత్వంతో పాటూ ప్రపంచ బ్యాంక్ కు నివేదించామని.. 2028 లోగా ఆ నిధులను వినియోగించి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. గతంలో అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 8 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించుకోలేదన్నారు. ఆ పథకాన్ని కూడా తీసుకువచ్చేందుకు కేంద్రంతో చర్చిస్తున్నాం.. రెండేళ్లు ఓపిక పడితే అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. కేంద్రంతో మళ్లీ సంప్రదించి ఈ నిధులను కూడా తీసుకు వస్తామని మంత్రి పేర్కొన్నారు.
Viral Video: “అది కొండచిలువ.. బల్లిని కాదు గురూ..” బాల్కనీలో పాము కోసం వెతుకుతూ..