పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్‌లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడలో కేరీర్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్ గా మారిందని అవకాశౄలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికీ ఉపాధి కల్పన సాధ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. దళిత బందును పుట్నాలు,…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. ద్రవ్యోల్భవణాన్ని నియంత్రిచలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించారు. అంతే కాకుండా దేశంలో చొరబాటును నియంత్రించలేక పోతున్న ఇలాంటి ప్రధానిని మీరేమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను కేటీఆర్ ట్వీటర్ వేదిగా ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని, శాటిలైట్ ఫోటోలతో సహా మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ ట్వీట్ చేసారు. అయితే.. 2021లొ…
ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దుండిగల్ పరిధిలోని బహదూర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వొకేషనల్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచుతున్నామని అన్నారు. 2013లో ఇదే కాలేజీ ఆవరణ నుంచి ఉద్యమంలో భాగంగా సకల జనుల భేరీ నిర్వహించామని, శంభీపూర్ రాజు…
కొద్దిరోజుల క్రితం ప్రజల వేషధారణ, భాషలపై నియంతృత్వ ధోరణి ప్రదర్శించిన బీజేపీ సర్కార్ ఇప్పుడు.. పార్లమెంట్‌లో కొన్ని పదాలను వాడకూడదంటూ నిషేధిత జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కేటీఆర్ ట్వీటర్ వేదికగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ఉత్తర్వులపై మండిపడుతూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. అయితే.. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ (ఎన్‌పీఏ) గవర్నమెంట్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఇదే అని కేటీఆర్ కొన్నింటిని ఉదహరిస్తూ ట్వీట్ చేయడం…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రంతో వరదలు భీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.అయితే ఈ వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటను కోల్పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, భారీ వర్షాలు పడినప్పటికీ .. రాష్ట్రంలో పెద్దగా పంటనష్టం జరుగలేదని , పంట నష్టం జరిగినట్లు తనకు సమాచారం అందలేదని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ట్వీటర్ వేదికగా..విమర్శల…
మత్తు మందులాగా దేశంలో మంతం తయారైందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని గ్రోత్ కారిడార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ లక్ష్మణ్ సంపాదకత్వంలో వెలువరించిన చరిత్రపుటల్లో తెలంగాణ గ్రంథాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం యావత్తు జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. లేకపోతే జర్మన్ కవి చెప్పినట్లుగా హిట్లర్ కాలంలో నాజీలు మనకోసం వచ్చేవరకు కూడా మేల్కోలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కాగా.. మతం రాజకీయ పార్టీ…