KTR: దేశంలో మతం మత్తుమందులాగా తయారైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మత్తు మందులాగా దేశంలో మంతం తయారైందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని గ్రోత్ కారిడార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ లక్ష్మణ్ సంపాదకత్వంలో వెలువరించిన చరిత్రపుటల్లో తెలంగాణ గ్రంథాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం యావత్తు జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. లేకపోతే జర్మన్ కవి చెప్పినట్లుగా హిట్లర్ కాలంలో నాజీలు మనకోసం వచ్చేవరకు కూడా మేల్కోలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కాగా.. మతం రాజకీయ పార్టీ ముసుగు వేసుకొని వస్తే అది దేశాన్ని గందరగోళ పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు పుడుతుంటారని.. ప్రస్తుతం కేసీఆర్ ఎదురు తిరిగాడని.. దేశమంతా ప్రశ్నించే గొంతులు పెరుగుతాయని ఆయన అన్నారు. అయితే.. తెలంగాణ చరిత్రను, పోరాటాన్ని, జరిగిన ఉద్యమాలు.. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం.. జాతరలు పండుగలు అనేకాంశాలను గ్రంథస్థం చేసిన ప్రొఫెసర్ లను అభినందించారు.
read also: ICC Rankings: టాప్-10లో భారత్ నుంచి ‘సూర్య’ ఒక్కడే..!!
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
ఈనేపథ్యంలో.. కులమత సంకెళ్లలో చిక్కుకుంటే దేశం పురోగమించలేదని.. మానవ సంపదైన యువతరం సెక్యులర్ భావాలతో ఎదగాలని, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దూసుకుపోవాల్సిన సమయంలో కుల, మత ప్రస్తావనల్లో కొట్టుకపోతే.. అదిదేశానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు కేటీఆర్. అంతేకాకుండా.. ప్రపంచ చరిత్రలను అధ్యయనం చేస్తున్న విద్యార్థులు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలపై దృష్టి పెట్టాలన్నారు. కాగా.. దేశంలో మానవత్వంపై దాడి జరుగుతున్నప్పుడు ఆలోచన పరులైన యువతరం స్పందించాలన్నారు. అయితే.. యువతరం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం వున్నదని.. లేకపోతే కులం, మతం పేరుతో కొట్లాడుకునే విష వలయాలలో చిక్కుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, గ్రంథ రచయితలు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రొఫెసర్ మాదాడి వెంకటేశ్వరరావు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ లు పాల్గొన్నారు.
LIVE : తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!