Minister KTR : జిల్లాల్లో ఒక్క ప్రాణ నష్టం ఉండొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా జులైలో అత్యధిక వర్షం నమోదు అయ్యిందని, ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతం నమోదైందని ఆయన వెల్లడించారు. జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవని, అయినా ఉదాసీనంగా, ఆలక్ష్యంగా ఉండొద్దన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆయన తెలిపారు. ఆస్తి నష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రో ఆక్టివ్ గా ఉండాలని, చెరువులు డ్యామ్లనుంచి నీటిని కిందికి విడుదల చేసే ముందు ప్రజలకి, పోలీస్ రెవెన్యూ వంటి ఇతర శాఖలో ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలన్నారు.
నీటి విడుదల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం ఉండొద్దన్నారు. ప్రాఫర్ గా మున్సిపాలిటీలతో సహా అన్ని గ్రామాలలో సేఫ్టీ అడిట్ జరగాలన్నారు. పట్టణాలు గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తాగునీరు కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్యం పైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలని, శిథిలావస్థలో ఉన్న పాత నిర్మాణాలను వెంటనే తొలగించాలి. నిరుపయోగంగా ఉన్న బోరుబావులతో పాటు నీటి బాగులను వెంటనే పూడ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలి. బ్యారికెడ్ ల నిర్మాణం చేపట్టాలన్నారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
Amarnath Yatra: కశ్మీర్ లోయలో భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!