కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ఈ విశ్రాంతి సమయంలో ఏవైనా ఓటీటీ కంటెంట్ చూడటానికి తనకు సలహా ఇవ్వమని కోరారు. దాంతో చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ట్విట్టర్ వేదికగా అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలని సూచించారు. అభిమానులు, సెలబ్రిటీలే కాకుండా ఓటీటీ సంస్థలు కూడా శుభాకాంక్షలతో పాటు సినిమాలు, సిరీస్‌లు చూడాలని కోరాయి.
Telangana Minister KTR leg injured: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తాజాగా తన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. తరచూ ఎడమ కాలిలో నొప్పి వస్తుండటంతో డాక్టర్ల వద్ద పరీక్షలు చేయించుకోగా శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తాను శస్త్రచికిత్స చేయించుకున్నట్లు స్వయంగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాలికి కట్టు ఉండటం వల్ల మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం మంత్రి…
KTR: వ్యక్తులకు ఇగో ఫీలింగ్ ఉంటుంది. ఓ రేంజ్‌లో ఉన్నోళ్లు కూడా దీన్ని ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ పేరును పూర్తిగా ప్రస్తావించరు. వైకాపా అని గానీ వైసీపీ అని గానీ క్లుప్తంగా అంటుంటారు. కేటీఆర్ బండి సంజయ్ కుమార్ పేరును షార్ట్ కట్‌లో "బీఎస్ కుమార్" అని వెరైటీగా రాశారు.
గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్మును కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ధ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసారు. ఎప్పుడు బీజేపీపై ప్రశ్నల వర్షం, మండిపడే కేటీఆర్ థ్యాంక్స్ చెప్పడమేంటని చర్చనీయాంశంగా మారింది. అయితే కేటీఆర్ ప్రధానికి థ్యాంక్స్ అంటూ సెటైర్ విసిరారు. సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్ . అయితే.. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ సెటైర్ వేసారు. అంతేకాకుండా.. దేశాన్ని…
Minister KTR Fires On Kishan Reddy Over Centre Funds: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వరద సహాయంపై కిషన్ రెడ్డి చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్‌డీఆర్ఎఫ్(NDRF), ఎస్‌డీఆర్ఎఫ్(SDRF) మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ఎన్డీఅర్ఎఫ్ ప్రత్యేక నిధులపైన కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని కౌంటర్ వేశారు. ఎన్డీఅర్ఎఫ్ ద్వారా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని ఆయన…