CFN Pabbala Anil: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో యువ జవాన్ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
KTR: మంత్రి కేటీఆర్ శుక్రవారం హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు 12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో.. పట్టణప్రగతి, సిఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఫ్లడ్ రిలీఫ్ పథకాల క్రింద రూ.12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Ward system: పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వార్డు పాలనా వ్యవస్థ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో నెలాఖరులోగా 150 వార్డు కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
Neera cafe: ట్యాంక్ తీరంపై ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా.. పక్కనే కొత్త సచివాలయం ఏర్పాటైంది. కాగా.. ఇప్పుడు నీరా కేఫ్ కూడా సిద్ధమైంది. నగరవాసులకు నోరూరించే తీపి నీరాను అందించి పరిశ్రమ స్థాయికి నీరాను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం 'నీరా కేఫ్'ను ఏర్పాటు చేసింది.