రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం లభించింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపించారు.
Minister KTR Investment: హైదరాబాద్‌లోని ఇద్దరు పాఠశాల విద్యార్థినిల మానస పుత్రిక అయిన డిజి జ్ఞాన్ అనే స్టార్టప్‌కి మంత్రి కేటీఆర్ ముచ్చటపడి సొంతగా 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ డిజిటల్ స్టార్టప్ వేదికను ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల కోసం రూపొందించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. మాచారెడ్డి మండల పరిధిలోని పాల్వంచను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్స్ సర్వీస్ సిట్‌కో కొత్త యూనిట్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందన్నారు.
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. దూమాల గ్రామంలో ఘనంగా జరుగుతన్న బీరప్ప ఉత్సవాలకు మంత్రి పాల్గొన్నారు.
50 ఏళ్లు అధికారంలో ఉన్న తనకు అవకాశం ఇస్తే ఎలా చేస్తారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ జవహర్‌నగర్‌లోని డంప్‌యార్డుకు తరలిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ చెత్తాచెదారం నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది.
T-hub: టీ-హబ్ అంటే టెక్నాలజీ హబ్. కానీ.. చాలా మంది తెలంగాణ హబ్ అనుకుంటారు. ఆ రేంజ్‌లో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెడుతోంది. తాజాగా.. టీ-హబ్‌ని మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మెచ్చుకున్నారు. ఈ వినూత్న కేంద్రం.. సాంకేతిక రంగంలో సాటిలేని ఒక అద్భుతమని అభివర్ణించారు.
పార్లమెంట్ కి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
అక్కడ పనులు ఆగిపోతే పనులు ప్రారంభించాలని బీజేపీ వార్నింగ్ ఇస్తేనే ఈ రోజు విగ్రహం పూర్తి అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.