ఓఆర్ఆర్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ వివాదంపై సంబంధిత మంత్రి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. సమాధానం ఇవ్వలేక మంత్రి కేటీఆర్ మొహం చాటేశారని విమర్శించారు. హెచ్‌జీసీఎల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని, ఏ టెండర్ అయినా 15, 20 ఏండ్లకు మించి ఇవ్వలేదని, కానీ… ఓఆర్‌ఆర్‌ని ముప్పై ఏండ్లు ఇచ్చారన్నారు. కేంద్ర నిబంధనలు ఉల్లంఘించారని, ప్రీ బీడ్ మీటింగ్ లో…నేషనల్ హైవే అథారిటీ… అభ్యన్తరం చెప్పిందన్నారు. 15 నుండి 20 ఏండ్ల వరకే టెండర్ ఇవ్వండి అన్నారని, దాన్ని కూడా తుంగలో తొక్కారన్నారు. ఏ టెండర్ వేసినా మినిమం ధర నిర్ణయిస్తారని, ప్రభుత్వం పనులు ఇస్తే తక్కువ ధర కోడ్ చేస్తుందన్నారు. ప్రభుత్త్వం ఆస్తి అమ్మితే… ఎక్కువ ధర నిర్ణయం చేస్తుందని, కానీ ఓఆర్‌ఆర్‌కి ఏం ధర నిర్ణయించకుండా ఎలా టెండర్ వేస్తారని ఆయన ప్రశ్నించారు. 30 ఏండ్లకు 22 వేల కోట్లు ఆదాయం వస్తుందని, కానీ 7500 కోట్లకు ఇచ్చాం అని అరవింద్ చెప్తున్నారన్నారు.
Also Read : Ponguleti Srinivas Reddy : పొంగులేటి, జూపల్లితో కొనసాగుతున్న బీజేపీ చేరికల కమిటీ బృందం భేటీ
ఓఆర్‌ఆర్‌ని బ్యాంక్‌లో పెడితే… 75 శాతం లోన్ వస్తోందని, ఓఆర్‌ఆర్‌మీద 15 నుండి 16 వేల కోట్ల రుణం వస్తుందన్నారు. ఎల్‌ఆర్‌డీ వెనకాల.. కేటీఆర్ బినామీలు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఎల్‌ఆర్‌డీ వాళ్ళను ముందు పెటారని, ఓఆర్‌ఆర్ మీద గడ్డి.. చెట్లు మేమే చూస్తాం అంటున్నారు అరవింద్ కుమార్ తెలిపారన్నారు. గడ్డి కూడా పికలేని వాడు.. ఓఆర్‌ఆర్‌ని ఏం మెయింటైన్ చేస్తారని, బేస్ ప్రెస్ చెప్పను అంటే ఏంటి, ఎందుకు దాచిపెడుతున్నావు, బేస్ ప్రెస్ లో కేటీఆర్ గుండె ఉందా.. టెండర్ సీక్రెట్ ఏముంది.. ప్రభుత్వం అంటే… బీఆర్‌ఎస్ ఒక్కటే కాదు.. ప్రతిపక్షాలు… కలిస్తేనే ప్రభుత్వం, అరవింద్ సమాచారం ఇవ్వను అంటే జైలుకి పోవాల్సిందే.. లేదంటే సీబీఐకి అయినా చెప్పాలి. లేదంటే బేడీ లు వేసి జైలుకి తీసుకుపోతారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Nithish Kumar : సీఎం నితీష్కు షాక్.. బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే
అంతేకాకుండా.. రాజకీయ ఆరోపణలకు సమాధానం ఇవ్వకు అరవింద్ కుమార్.. నీ లాగా నీలిగిన వాళ్లంతా సీబీఐ దగ్గరికి పోయారని రేవంత్ రెడ్డి అన్నారు. నీ కళ్ళముందు చాలా మందిని చూశావు.. రిటైర్డ్ అయినా బీఎల్‌ఎన్ రెడ్డి ని మళ్ళీ తెచ్చి సంతకాలు పెట్టిస్తుంది.. మూడు నెలలు ఉండే కేసీఆర్.. ముపై ఏండ్లు ఓఆర్‌ఆర్‌ని ఎలా అమ్ముతారు.. స్టేట్ విజిలెన్స్ కి ఫిర్యాదు చేస్తా.. ఐఏఎస్ అధికారుల పై డీఓపీటీ, సెంట్రల్ విజిలిన్స్ కి అరవింద్ కుమార్ పై ఫిర్యాదు చేస్తా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డప్పుడు కాగ్ పర్యవేక్షణ చేస్తుంది, ఓఆర్‌ఆర్ టెండర్ పై కాగ్ కి ఫిర్యాదు చేస్తా, కోర్టుకు కూడా వెళ్తా, బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేస్తా, బంగారు బాతు గుడ్డు తినే బదులు.. బాతు ని తిన్నట్టే ఉంది ఓఆర్‌ఆర్ టెండర్, కేబినెట్ ఆమోదం అంటే అందులో అంతా దేవుళ్లే ఉంటారా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కి కూడా కేబినెట్ ఆమోదం ఉంది, వైఎస్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మీద కూడా విచారణ జరిగింది, కేసీఆర్ క్యాబినెట్ అంతా ఆయన అమనుషులే కదా’ అని రేవంత్ అన్నారు.