Minister KTR: జమ్మూ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల వాసి మృతి.. కేటీఆర్ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో యువ జవాన్ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Read also: Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్.. తలసాని కీలక వ్యాఖ్యలు
Also Read
బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన పబ్బల మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు అనిల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో చేరాడు. దాదాపు 11 ఏళ్లుగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం CFN AVN టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సౌజన్యతో వివాహమైంది. ఈ దంపతులకు అయాన్ మరియు ఆరవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిల్ నెల రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చి రెండో కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. తన అత్తగారి గ్రామంలో ఏర్పాటు చేసిన బీరప్ప ఉత్సవానికి కూడా వెళ్లాడు. పది రోజుల కిందటే గ్రామం వదిలి మళ్లీ డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా గురువారం ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణించారు. హెలికాప్టర్ కుప్పకూలడంతో అతడు చనిపోయాడు. ఈ విషయం తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేసింది. శుక్రవారం సాయంత్రం అనిల్ మృతదేహం మల్కాపూర్ గ్రామానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతికి తెలంగాణ ప్రణాళికా సంఘం కుమారుడు బోయినపల్లి వినోద్ సంతాపం తెలిపారు. అనిల్ మృతి బాధాకరమన్నారు. అనిల్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Siddipet Crime: కొడుకులు పంచుకున్నారు.. భరించలేక తన చితికి తానే నిప్పంటించుకున్న తండ్రి
జమ్మూ కాశ్మీర్‌లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కిష్త్వార్ జిల్లా మార్వా తహసీల్‌లోని మచ్నా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బళ్ల అనిల్ (29) సిరిసిల్ల జిల్లా వాసి. ఈ విషయం తెలియడంతో జిల్లా మొత్తం విషాదంలో మునిగిపోయింది.
KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?