Minister KTR : కిట్స్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ వెరీ బ్యూటిఫుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ కిట్స్ కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. కిట్స్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ వెరీ బ్యూటిఫుల్ అన్నారు. నాలుగేళ్ల క్రితం ప్రధానమంత్రి మోడీ మీటింగ్ పెట్టి నన్ను పిలిచారని, భారతదేశం అభివృద్ధి చెంది అగ్రరాజ్యాల సరసన నిలవాలంటే మనం ఏమి చేయాలని ప్రధాని అడిగారన్నారు. మూడు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని, ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే త్రీఐస్ ఇంపార్టెంట్ అని చెప్పానన్నారు. ఫస్ట్ ఐ ట్రాన్స్ఫరెన్సీ ఇన్నోవేషన్, సెకండ్ ఐ ట్రాన్స్ఫరెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్షన్, థర్డ్ ఐ ఇంక్లోసింగ్ గ్రోత్.. ఈ మూడు అంశాలను ఆరోజు మోడీ దృష్టికి తీసుకెళ్లానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ‘ఈరోజు కిట్స్ ఇంక్యుబెషన్ అందులో భాగమే. 1997-98 లో నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్లాను. అమెరికాలో ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికాలో గుడ్ హైవేస్ ఉన్నాయి… అమెరికా రిచ్ కంట్రీ. మడి కట్టుకొని ఉంటే అభివృద్ధి చెందలేము. ఆ రోజుల్లో రిటైర్డ్ అయ్యే నాటికి సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజుల్లో ఉద్యోగం పొందిన తర్వాత ఫస్ట్ కారు,ఇల్లు కొంటున్నారు.
Also Read : RR vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
ఆ రోజులకు.. ఈ రోజులకు చాలా తేడాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ అయితే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విప్లవాత్మక మార్పు తీసుకురావడమే ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ పిల్లలకో, టెక్నాలజీకో స్టాట్ అప్ కు పరిమితమైంది కాదు. మార్పు గవర్ననెన్స్ లో రావాలి… మన లైఫ్ లో రావాలి. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ లో ప్రభుత్వం పాత్ర ఎంతా ఉంటుందో… ప్రైవేట్ వ్యక్తులుగా మీ పాత్ర అంతే ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లలు బోల్డుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చిన బుర్రను(మైండ్) ఇతర దేశాల వాళ్ళు ఉపయోగించుకున్నారు..మనం ఉపయోగించలేకపోతున్నాం. ప్రపంచస్థాయి ఉత్పత్తులపై మనం దృష్టి పెట్టలేదు. చైనా లాంటి దేశాలు నా పోటీ అమెరికా, జపాన్ అని ఉన్నారు. మనమేమో నా పోటీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక అని ఇక్కడ చాస్తున్నాం. ప్రపంచ స్థాయి ఉత్పత్తులపై ఇతర దేశాల వాళ్ళు పోటీపడుతున్నారు. మనమేమో కులం ఏంటి? మతం ఏంటి?… అసలు పని మీద ధ్యాస లేదు… ఇది మన అవలక్షణం.
Also Read : Allergy Foods : ఈ తొమ్మిది ఆహారాలు ‘ఫుడ్ అలర్జీ’కి కారణమట..!
మంచినీళ్లు ఇవ్వాలని, కరెంటు ఇవ్వాలని, మంచి పనులు చేయాలని సోయి లేదు. ఇవన్నీ పోవాలంటే ఫోకస్ మారాలి…సములా మార్పులు రావాలి. ఉద్యోగాలు చేయడం కాదు… నేను సైతం అంటూ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు రావాలి. మనం చేసే పనులలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి.. వాటిని అధిగమించినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తాం. కేసీఆర్ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ముందుకు సాగడం వలనే ఉన్నత స్థాయికి చేరాడు’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్‌డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!