రేపు ( ఆదివారం ) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అత్యంత కీలకమైన ఫైల్ మీద తన మొదటి సంతకం చేయనున్నారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్నారు.
Minister KTR: తెలంగాణ రాష్ట్రం నేడు ఐదు విప్లవాలను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
KTR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశం కొనసాగుతోంది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దేశంలో గుణాత్మక మార్పు సాధించేందుకు బీఆర్‌ఎస్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి బీఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
రాష్ట్రానికి మోడీ చేసిన మోసాలు, బీజేపీ చేసిన అన్యాయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని మంత్రి కేటీఆర్ నేతలకు సూచించారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కేటీఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ నెల 25న జరగబోయే ప్రతినిధుల సభలు.. వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లు అంటూ నేతలకు సూచనలు చేశారు.