Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయనుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత త్వరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్…
Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు వ్యక్తిగత సెలవులపై వెళ్తున్నారు.. తన ఒత్తిడి కారణంగా వెళ్తున్నారని మంత్రి కొండపల్లి ఇన్ఛార్జ్ డీఆర్వో వద్ద ప్రస్తావించారు.. తన ఆదేశాలు లేకుండా మంత్రిని కలిస్తే కఠిన చర్యలే.. గ్రీవెన్ లో ఉన్న జిల్లా అధికారులకు కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌కు తృటిలో భారీ ప్రమాదం తప్పింది.. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో MSME మీటింగ్‌కు హాజరయ్యారు మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా.. అయితే, ఒక్కసారిగా ఫొటోల కోసం కార్యకర్తలు, స్థానికులు ఎగబడటంతో కృష్ణాపురంలో MSME మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది..
కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.. కొప్పర్తి పారిశ్రామిక వాడను పరిశీలించారు పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎం.ఎస్.ఎం పార్క్‌పై అపోహలు వద్దు.. జిల్లాలోని ఏర్పాటు చేస్తాం అని స్పష్టం చేశారు.. ఐటీ పార్క్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 ఎకరాలు ఐటీ పార్క్ కోసం స్థల…
Kondapalli Srinivas: టీటీడీ మాజీ చెర్మెన్ భూమన కరుణాకరెడ్డి పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దేవాలాయల అబివృద్దికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఈ వేసవిలో సామాన్యులకు సైతం సకాలంలో తిరుమలలోని దైవ దర్శనం జరేగేందుకు వీలుగా L1 దర్శనం కూడా రద్దు చేశామని ఆయన అన్నారు. అటువంటి కూటమి ప్రభుత్వం పైన భూమన కరుణాకరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న…
ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను.. సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రస్తుతం కంట్రోల్‌లో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 13న తొలి డయేరియా కేసు నమోదైందని తెలిపారు. గుర్లలో ఎనిమిది మంది మృతి చెందినా.. ఇప్పటి వరకు డయేరియాతో మృతి చెందిన వారు ఒక్కరేనన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించాల్సిన ఆర్థిక ప్రగతి, కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకోసం మాస్టర్ కార్డు కేంద్రం ద్వారా సాధిస్తున్న ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై ఆయా రంగ ప్రముఖులతో శుక్రవారం ప్రధానంగా చర్చించారు.
పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త తెలిపింది. ఈ నెల 31వ తేదీ నాడే పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పింఛన్లను ఈ నెల 31వ తేదీనే ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.