ఎమ్ఎస్ఎమ్ ఈ పరిశ్రమల ఏర్పాటు, పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డ్వాక్రా గ్రూపులతో ఎమ్ఎస్ఎమ్ఈలు స్థాపించేలా ప్రొత్సహం ఇవ్వనున్నట్లు తెలిపారు. వివిధ రకాల ఉత్పత్తులకు కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ లకు ప్రొత్సహం ఇచ్చే ఆలోచన ఉందన్నారు. జిల్లాల్లో డీఐసీలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఏయే పరిశ్రమల ఏర్పాటు చేయవచ్చనే సమాచారాన్ని డీఐసీల్లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. రానున్న కాలంలో 50 ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నామన్నారు.
READ MORE: J-K Elections: జమ్మూ ఎన్నికల్లో నెహ్రూ ప్రస్తావన.. ఉగ్రవాద ఆరోపణలున్న రషీద్ నోట.. నెహ్రూ పేరు
ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్మెంటే కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైజింగ్ అండ్ ఎక్సలరేటింగ్ ఎమ్ఎస్ఎమ్ఈ ప్రొగ్రాం-ఆర్ఏఎమ్ పీ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. ఆర్ఏఎమ్‌పీ స్కీం కింద కేంద్రం రూ. 100 కోట్లు ఇచ్చిందని.. ఎమ్ఎస్ఎమ్ఈ లకు రూ. 1500 కోట్ల మేర ప్రొత్సహాకాలను గత ప్రభుత్వం పెండింగులో పెట్టిందని చెప్పారు.
READ MORE: Vande Bharat: మరో 10 వందే భారత్ రైళ్లు లాంచ్.. 15న ప్రారంభించనున్న మోడీ
పెండింగులో ఉన్న ప్రొత్సహకాలను చెల్లించేలా ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలిచ్చారని.. ప్రొత్సహాకాల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈల అభివృద్ధి.. పాలసీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. యువకులు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చేలా పాలసీ రూపొందిస్తున్నామని తెలిపారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీం ఫర్ ఎమ్ఎస్ఎమ్ఈ అనే కేంద్ర పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు చేపడుతున్నామన్నారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీం ఫర్ ఎమ్ఎస్ఎమ్ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు పెడితే.. కేంద్రం రూ. 5000 కోట్లు ఇస్తారని చెప్పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమల స్థాపన కోసం ఎమ్ఎస్ఎమ్ఈ-1 పేరుతో వెబ్ సైట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.