Kondapalli Srinivas: టీటీడీ మాజీ చెర్మెన్ భూమన కరుణాకరెడ్డి పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దేవాలాయల అబివృద్దికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఈ వేసవిలో సామాన్యులకు సైతం సకాలంలో తిరుమలలోని దైవ దర్శనం జరేగేందుకు వీలుగా L1 దర్శనం కూడా రద్దు చేశామని ఆయన అన్నారు. అటువంటి కూటమి ప్రభుత్వం పైన భూమన కరుణాకరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బ తీసేవిదంగా మాట్లాడటం సరికాదని, ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేసే సమయంలో ఎటువంటి అవినీతి జరిగిందో, నెయ్యిలో ఎటువంటి కల్తీ జరిగిందో చూసామని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి దేవస్థానం నడుపుతుంటే., నెయ్యిలో అవినీతి జరిపి వ్యాపారం చేసే మనషి… అసత్య ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారంటూ మంత్రి కొండపల్లి ఫైరయ్యారు.
మార్పవైపు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు కూడా భూమనపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. భూమనపై క్రిమినల్ కేసులు పెడతామని, భూమనను వదిలిపెట్టమని ఆయన అన్నారు. ఒక్కరూపాయి అవినీతి జరుగకుండా, శ్రీవారి భక్తులకు సేవ చేస్తున్నట్లు ఆయన అన్నారు. భూమన హిందువు కాదు. టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దు.. ఆయన ఛైర్మన్ గా భూమన అన్నీ స్కాంలకే పాల్పడ్డారని ఆయన అన్నారు. ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ లో కూడా అన్నీ అక్రమాలేనని, భూమన కమిషన్ల ఛైర్మన్ అంటూ వ్యాఖ్యానించారు.
భూమన టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు గోవులకు పురుగుల దానా పెట్టారని, భూమన అతిపెద్ద అవినీతిపరుడనాని అన్నారు. కమిషన్లు లేకుండా ఒక్కపని కూడా చేయని వ్యక్తిని, దేవుడితో పెట్టుకుంటే ఆయన చూస్తూ ఊరుకోడని, భూమనను దేవుడు శిక్షిస్తాడని ఈ సందర్బంగా ఆయన అన్నారు. అనారోగ్యం, వృద్థాప్యంతో గోవులు మరణించాయే తప్ప టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఆయన అన్నారు. భూమన టీటీడీని టార్గెట్ చేశాడని, భూమన విడుదల చేసిన ఫోటోలన్నీ మార్ఫింగ్ ఫోటోలే అంటూ తెలిపారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి మార్ఫింగ్ ఫోటోలను భూమనకు ఇచ్చాడని, వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాటలో భూమన హస్తం ఉండొచ్చని సంచలన వ్యాఖ్యలు చేసారు, టీటీడీ గోశాల డైరెక్టర్ గా పనిచేసిన హరినాథరెడ్డి తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్నారని.. తొక్కిసలాటకు హరినాథరెడ్డి కారణం కావచ్చునని ఆయన తెలిపారు.