Minister Kondapalli Srinivas: ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను.. సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.. కూటమి ప్రభుత్వ వచ్చాక భూ వివాదాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
Read Also: Bitcoin : కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.. 24గంటల్లో రూ.10లక్షలు నష్టం
ఇక, ప్రతీ రైతన్న.. తమ భూమికి సంబంధించిన వివరాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని చెక్ చేసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. రీ సర్వే పేరుతో గత ప్రభుత్వం హయాంలో పలు లోటు పాట్లు జరిగాయి. జిల్లాలో 9 వేల దరఖాస్తులు భూ సమస్యలుపై వచ్చాయి.. ఇకపై భూ సమస్యలు రాకుండా చూసే విధంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.. ఈ అవకాశం మరలా మీకు రాదు.. రెవెన్యూ అధికారులు మీ వద్దకు వచ్చేటప్పుడు.. మీ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్..