సీఎం కేసీఆర్ ఈ నెల 12 వ తేదీని భువనగిరి శివార్లలోని రాయగిరిలో బహిరంగ సభ ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం పరిశీలించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జగదీశ్ రెడ్డి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా…
ప్రధాని మోడీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెనుదుమారం రేపుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ తెలంగాణకు పట్టిన శనిగ్రహం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ రూపంలో తెలంగాణను వెంటాడుతున్న భూతం అంటూ విమర్శించారు. కేసీఆర్ పథకాలతో ప్రధాని మోడీ వణికిపోతున్నారని, అందుకే పురిటీలోనే అణిచివేతకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిలువరించాల్సిన బాధ్యత యావత్ ప్రజానీకంపై ఉందని, అందుకు గులాబీ శ్రేణులు…
ఈ నెల 12వ తేదీన భువనగిరిలో జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశo నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే, భాస్కర్ రావు, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎదో రాజకీయ నాయకుడిలాగా ఓట్ల కోసం సంక్షేమ పథకాలు తెచ్చే అలవాటు కేసీఆర్ కు…
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే, గులాబీ పార్టీ నేతలు మాత్రం రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే వున్నారు. సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, ఆయన ముట్టుకుంటే భస్మం అవుతారని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం కల సాకారం చేసిన…
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (టీఎస్‌ట్రాన్స్‌కో) ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి చేస్తున్న విద్యుత్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఎస్‌ట్రాన్స్‌కో, టీఎస్ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు, టీఎస్…
బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడ్డ తెలంగాణలో వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం సూర్యాపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటజిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే పలవురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా, రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.. వైద్యుల సూలచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు.. అంతే కాదు, ఈ మధ్య తనను కలిసినవారంతా కరోనా…
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. విద్యుత్ ఛార్జీల పెంపు స్వల్పంగానే ఉంటుంది. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజలు సమర్దిస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. గడిచిన ఏడు సంవత్సరాల్లో ఒక్క పైసా పెంచలేదు. తెలంగాణ పక్క రాష్టాల్లో అక్కడి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచాయి. సింగరేణి…
వరి విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోంది తప్ప రాష్ట్రానికి మేలు చేయడం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా ఏంలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భాష గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ…
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎలక్ట్రిక్ బైకుపై నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ‘ఈవీ ట్రేడ్ ఎక్స్‌పో’ పేరిట జరిగిన విద్యుత్ వాహనాల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఎలక్ట్రిక్ బైకును నడుపుతూ ట్రయల్స్ వేశారు. వాయు, శబ్ద కాలుష్యాన్ని ఈ-బైక్స్ ద్వారా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారికి ట్యాక్స్ మినహాయింపులతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్…