దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని జాతీయ పార్టీలు వైఫల్యం చెందాయని విమర్శించారు. దేశ అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకమైన పద్దతిలో పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన మొదటి నుండి అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ…
పట్టణాలతో పల్లెలు పోటీ పడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని.. ఆ సంకల్పం నెరవేరినందునే కేంద్రం నుండి గ్రామపంచాయతీలకు అవార్డులు వచ్చాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి అవార్డులు రావడాన్ని తట్టుకోలేకే అణిచివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని అన్నారు. డిస్కంలకు లోన్లు మంజూరు కాకుండా అడ్డుపడడం అందులో భాగమే అని ఆరోపించారు. కేంద్రం కరెంట్ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఇన్ని…
వరిదిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ ను మించి పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్జీనియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐల మీట్&గ్రీట్ నిర్వహించారు. సుమారు 300 మంది ఎన్‌ఆర్‌ఐలు ఇందులో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై ఎన్‌ఆర్‌ఐలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి జగదీష్…
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 14న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలోని ఆయన ప్రసంగిస్తారు. అయితే.. ఈ మేరకు సభ విజయవంతం చేయడానికి టీఆర్‌ఎస్ శ్రేణులు జనసమీకరణ చేస్తున్నాయి. అంతేకాకుండా సభా ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే గురువారం సభా ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి,…
కేంద్రంలో మధర్ థెరిస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండలంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సమృష్టి వ్యవసాయ అభివృద్ధిపై రైతాంగం దృష్టి సారించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన నీరు, విద్యుత్‌ను సమృద్ధిగా అందుబాటులో ఉంచిందన్నారు. రైతాంగం అధిక…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతానికి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యతో మనిషుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలతో పాటు మైనార్జీలకు…
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోంది. తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు అంటుంటే.. పరిస్థితులకు అనుగుణంగానే కొనుగోలు జరుపుతామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక వంకలతో తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో పండిన ప్రతీ వరి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర…
5th Day Telangana Assembly Budget Sessions. Congress MLA Komatireddy Raj Gopal Reddy Countered To Minister Jagadish Reddy Comments. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ పోచారం శ్రీనివాస్ సస్పెండ్ చేయడంతో.. సభలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. నేడు ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో నేడు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్…
మహిళల భద్రత, స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, అదే నిజమైన మహిళా సాధికారత అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం అన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా చౌటుప్పల్‌లో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, అందుకే అన్ని పథకాల కింద కుటుంబాల్లోని మహిళ పేరు మీద అధికశాతం ప్రయోజనాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలోని మహిళలు మరియు బాలికల భద్రత…
అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి జగదదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ చేస్తున్నా మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వ పథకాలకు కొబ్బరి కాయలు కొట్టకుండ, అభివృద్ధికి నిధులు తేవాలన్నారు.. అభివృధి అంటే కేసీఆర్ నియోజకవర్గానికి 6 వరసల రోడ్లు కాదు, మా మునుగోడు నియోజకవర్గానికి వేసి చూపించాలన్న ఆయన..…