సీఎం కేసీఆర్ ఈ నెల 12 వ తేదీని భువనగిరి శివార్లలోని రాయగిరిలో బహిరంగ సభ ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం పరిశీలించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జగదీశ్ రెడ్డి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా అందుబాటులో ఉంచారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. రేపు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో.. కేసీఆర్ కృషికి కృతజ్ఞతగా జనగామలో బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఈ సభలో లక్షకు పైగా ప్రజలు హాజరవుతారని మంత్రి తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్.. కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. భోజనవిరామం అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై సమీక్షిస్తారు. ఆ తర్వాత తెరాస కార్యాలయాన్ని ప్రారంభించి.. జిల్లా ముఖ్యనాయకులతో సమావేశమవుతారు. అనంతరం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.