కేసీఆర్, టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 21వేల కోట్ల కాంట్రాక్టు వచ్చాకే కాంగ్రెస్ ను వీడి బీజేపీ పంచన చేరాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేదన్న ఆయన.. అభివృద్ధి కోసమే వారు గులాబీ పార్టీలోకి వచ్చారన్నారు.
ప్రధాని మోడీ తల్లి పాల మీద తప్ప అన్నింటిపై పన్నులు వేశారని.. మోడీ పనుల ప్రధాని కాదు పన్నుల ప్రధాని అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ, విద్యుత్ ప్రసారానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంతరాయం ఉండదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం విద్యుత్ సౌధలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని…
ప్రధాని మోడిప్రసంగంపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అమ్యారు. వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ వస్తుంది.. కానీ అది కేసీఆర్ నేతృత్వంలో వస్తుందని పేర్కొన్నారు. మోడీ మాటల్లో అన్ని అబద్ధాలే అని మండిపడ్డారు. వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్లకు నిధులిచ్చింది లేదు.. విదిలిచ్చింది లేదంటూ ఎద్దేవ చేసారు. సిగ్నల్ ఫ్రీ సహచర మంత్రి కేటీఆర్ చొరవతోటే…
అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలి అంటూ ఉద్యమం మొదలైందే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు కొనసాగింపే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు అని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని యువత గుర్తించినందునే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందన్నారు. ఈ మేరకు శనివారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకు పరాకాష్టే బీహార్,సికింద్రాబాద్ ఉదంతాలు అని ఆయన…