Jagadish Reddy: వరి దిగుబడిలో ‘తెలంగాణ’ పంజాబ్‌ను అధిగమించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరిదిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ ను మించి పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్జీనియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐల మీట్&గ్రీట్ నిర్వహించారు. సుమారు 300 మంది ఎన్‌ఆర్‌ఐలు ఇందులో పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై ఎన్‌ఆర్‌ఐలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు. ఎన్‌ఆర్‌ఐల డెవలప్‌మెంట్ ఫోరమ్ కు చెందిన బొజ్జ అమరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. వరి దిగుబడిలో రాష్ట్రం పంజాబ్ ను మించిపోయిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి .
Also Read
రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్రం చేతులు ఎత్తేస్తే సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో స్పందించి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలుపరిచిన మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు.
కేంద్రప్రభుత్వ రంగ సంస్థలతో సహా దేశ, విదేశీ సంస్థలు కితాబిచ్చాయన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అందుకు సీఎం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతుందన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణా రికార్డులకెక్కిందన్నారు. అద్భుతమైన పాలనతో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రగతి పై చర్చను నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి తో పాటు ఎన్‌ఆర్‌ఐలు శ్రీనివాస రెడ్డి, మనోహర్, కాల్వల విషు, పాదురు శ్రవణ్, అమరేందర్ బొజ్జ, సుధా కొండరాపు, బాబు రావు, తదితరులు పాల్గొన్నారు.
Boney Kapoor : సైబర్ ఫిషింగ్ వలలో బోనీ కపూర్.. 4 లక్షలు హాంఫట్..
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!