Harish Rao: బంజరు భూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని విభాగాల అధిపతుల దగ్గర నుంచి మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు.
Harish Rao: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితేల రాజేశ్వర్ రావు విగ్రహాన్ని ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
Harish Rao: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ వాఖ్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నాడు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం పేరు మార్చి మోడీ ప్రభుత్వం కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు.. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి అని ప్రధాని మోడీ అంటున్నారు.. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో పనీ చేస్తున్న 27 వేల మంది ఆశలకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఈనెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రాజెక్ట్ అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే, తాజాగా రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.